కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తొలి స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కేరళ తీరంలో ఈరోజు ఒక కొత్త శకం ప్రారంభమైందని, అమృతోత్సవ వేడుకల వేళ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక ప్రారంభం శుభపరిణామమని, ఈ నౌకను జాతికి అంకితం చేస్తున్నానని […]