ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ‘అయోనిక్ 6‘ పేరిట ఓ సెడాన్ కారును ఆవిష్కరించింది. అయోనిక్ 6 విషయానికొస్తే.. ఇది సెడాన్ మోడల్ కారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని హ్యుందాయ్ వెల్లడించింది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 185 కి.మీ. కాగా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. […]