ప్రాంక్ వీడియోలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ ఒక యూట్యూబర్ పై నెటిజన్స్ ఫిర్యాదు చేశారు. కొంతమందిని కారులో ఎక్కించుకుని వారిని భయపెడుతున్నాడని.. ఇలాంటి వీడియోల వల్ల ఒత్తిడి పెరిగి ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు.
అదృష్టం కలసి రాకపోతే అరటి పండు తిన్నా.. పన్ను ఉడుద్ది అంటారు. ఇలా లక్ కలసి రాకపోతే సరదాగా చేసే పనులు కూడా చిక్కులు తెచ్చి పెడుతాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఓ విచిత్ర సంఘటన చోటుకి చేసుకుంది. ప్రాంక్స్ చేసే ఓ యూట్యూబర్.. హైదరాబాద్ లోని జగదీశ్ మార్కెట్ లో ఉండే ఓ మొబైల్ షాప్ లోకి వెళ్ళాడు. అక్కడ ముందుగా తాను అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం షాప్ యజమానికి చిరాకు తెప్పించాడు. […]