బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా రానున్న 3-4 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలకు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. […]