తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ లో పర్యటిస్తున్న ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇక ఎన్ని కేసులు పెట్టినా, జైళ్లో పెట్టినా ముందుగా నన్నే పెట్టాలని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇక సముద్రం ప్రశాంతంగా ఉందని చులకన చూడొద్దని అదే రేపటి ప్రళయంగా మారొచ్చనే రీతిలో ఈటల కేసీఆర్ పై ధ్వజమెత్తారు. దీంతో పాటు దళిత బంధు పథకంలో […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించబోతున్న పథకం దళిత బంధు. దీనిపై సర్కార్ ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలు రూపోందించి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి వర్గం దీనిని తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్ ఆదేశించింది. దళిత బంధు పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ విస్తృతంగా చర్చించింది. పథకం అమలుకు అన్ని రకాల ప్రణాళికలు రూపొందించారు. […]
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాల వేటలో తలమనకలవుతున్నాయి. ఒక పక్కఈటెల బీజేపీలో చేరి పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. వరుస సమావేశాలతో ప్రజలతో మమేకమవుతూ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. ఇక ప్రధానంగా హుజురాబాద్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు సీఎం కెసిఆర్. ఎలాగైనా ఈటెలకు చెక్ పెట్టి, ఓడించాలని కంకణం […]
తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ రంగులు మారుతూ వర్ష కాలంలోను హీట్ పుట్టిస్తున్నాయి. ఇక నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు. రాజీనామా చేయడంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన విషయమ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల చేరికపై నా అభిప్రాయాన్ని అడగలేదని మోత్కుపల్లి అన్నారు. ఇక పార్టీలోకి సీనియర్ నేతలకు సరైన స్థానం […]
మాజీ మంత్ర్రి ఈటెల రాజేందర్ తెరాస పార్టీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. గతంలో ఆయనపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికార తెరాస పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కావాలనే నాపై అవినీతి ఆరోపణలు సృష్టించారని అప్పట్లో ఈటెల పెద్ద ఎత్తున గొంతెత్తారు. ఇలా కొన్ని అనూహ్య పరిణామల మధ్య ఈటెల రాజేందర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి చివరికి భారతీయ జనతా పార్టీ చేరిపోయారు. ఇక అప్పటి నుంచే ఈటెల తన […]