బిజినెస్ డెస్క్- అంబాసిడర్.. ఈ కారు పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియదేమో గానీ.. ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు అంబాసిడర్ కారంటే తెలియనివారుండరు. అప్పట్లో కార్లలోకెల్ల రారాజు కారు ఏదంటే టక్కున అంబాసిడర్ కారు అని చెప్పేవారు. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీకి చెందిన అంబాసిడర్ కారు సుమారు ముప్పై ఏళ్లపాటు ఓ వెలుగు వెలిగింది. దేశ ప్రధాని నుంచి మొదలు సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులంతా అంబాసిడర్ కారులోనే తిరిగే వారు. ఐతే కాలక్రమేనా […]