Hyderabad: హైదరాబాద్ మహానగరంలో పర్యాటకుల ఆకర్షణ కేంద్రంగా ప్రసిద్ధి చెందినటువంటి హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. గత మూడు రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వానలకు హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. అయితే.. సాగర్ అసలు నీటిమట్టానికంటే ఎక్కువ వరద నీరు చేరడంతో.. సాగర్ లోతట్టు ప్రాంతాలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం. ఇక హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 513.50 మీటర్లకు […]
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా AIMIM చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆయన వాహనంపై గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒవైసీ మీరట్‌లోని కితౌర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ గేట్ వద్దకి రాగానే మొత్తం నలుగురు వచ్చి కారుపై కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు. తనపై పిరికిపందలు […]
ఇండియాలోని బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీ బ్యాంకు అకౌంట్ కేవైసీ(Know Your Customer) ప్రాసెస్ కరెక్ట్ గా పూర్తి చేసారా లేదా ఓసారి చూసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవంటుంది RBI. కేవైసీ ప్రక్రియను పూర్తిచేయని బ్యాంకు ఖాతాలు 2022 జనవరి 1 నుండి పనిచేయవని ప్రకటించింది. ఆర్బీఐ తాజా నిబంధనల మేరకు.. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పక్కాగా కేవైసీ రూల్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది. అందువల్లే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కస్టమర్ల కేవైసీ వివరాలను […]
గులాబ్ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్ర ప్రజలను వణికిస్తుంది. ఆదివారం రాత్రి తీరం దాటిన ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం, బుధవారం భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని […]