వెండితెరపై పెద్దగా సక్సెస్ రాని వారంతా బుల్లితెరకు వస్తుంటారు. అక్కడ నటించేందుకు అవకాశం ఉండటంతో పాటు సంపాదన కూడా ఉంటుంది. సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేస్తూనే సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. తమను తాము నిరూపించుకునేందుకు ఆత్రుత కనబరుస్తుంటారు. . అటువంటి వారిలో ఒకరు నటి హరితేజ.
ఫిల్మ్ డెస్క్- తాను కరోనా బారినపడ్డానని ప్రముఖ బుల్లితెర యాంకర్, సినిమా నటి హరితేజ చెప్పింది. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఇన్స్టా వేదికగా ఓ భావోద్వేగ వీడియోని షేర్ చేసింది. డెలివరీ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అభిమానులతో చాలా విషయాలు చెప్పుకొచ్చింది హరితేజ. డెలివరీకి కొన్నిరోజుల ముందు ఇంటిల్లిపాదికి కరోనా సోకడంతో తాను ఎంతో బాధపడ్డానని ఆమె అంది. డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు ఆస్పత్రికి వెళ్లాను.. వైద్యులు […]