సౌత్ అమెరికా దేశమైన పరాగ్వేలో ప్రకృతి ఊహించని రీతిలో ఉగ్రరూపం దాల్చింది. రాజధాని నగరం అసన్సియోన్‌లో విరుచుకుపడిన భీకర వడగళ్ల వర్షం సర్వస్వాన్ని ధ్వంసం చేసింది. ఆకాశం నుంచి పడుతున్న భారీ వడగళ్లను చూసి స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాహనాల అద్దాలు పగిలిపోవడం, భవనాల పైకప్పులు ధ్వంసమవ్వడంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. అసన్సియోన్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన మబ్బులతో […]