తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న సినిమాల హవా బాగా పెరిగిపోయాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు ప్రతి సంవత్సరం మూడు నాలుగు వస్తే.. చిన్న సినిమాలు పదుల సంఖ్యల్లో వస్తున్నాయి. కంటెంట్ ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా బ్లాక్ బస్టర్ చేస్తారు ఆడియన్స్. జబర్ధస్త్ నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.