పెళ్లి అనేది నూరేళ్ల జీవిత ప్రయాణం. ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉంటూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. వరుడు నచ్చలేదనో, వధువు నచ్చలేదనో, అధనపు కట్నం కోసం వేధింపులు శరమామూలే అయిపోయాయి. ఇదే కోవకు చెందిన ఓ ప్రభుద్దుడు పెళ్లి తరువాత భార్యతో కాపురం చేయకుండా అదనంగా డబ్బులిస్తేనే సంసారం చేస్తానని చెప్పిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.