ఆడపిల్ల పుట్టిందనగానే గుండెలపై భారం పడిందని భావించే కాలం పోయింది. ఆడ, మగ ఎవరు పుడితే ఏంటీలే.. ఇద్దరూ సమానమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు. చదివించడం దగ్గర నుండి ఆస్తి పంపకాలు వరకు అన్నింటా ఆడ,మగ అనే వ్యత్యాసం కనబర్చడం లేదు. నాగరికత, అక్షరాస్యతకు ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలు తప్ప.. మిగిలిన వారంతా మగ పిల్ల వాని కంటే ఆడ పిల్లకే మొగ్గు చూపుతున్నారు. పిల్లలు కలగని వారి సైతం.. దత్తత విషయంలో ఆడపిల్లకే ఓటు వేస్తున్నారట. […]