ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన బాలీవుడ్ సినీ నటి, మోడల్ గెహనా వశిస్ట్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. వీడియోల చిత్రీకరణలో, ఫిర్యాదు చేసిన యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు గెహనా వశిష్ట్‌కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపైనే ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ […]