భారత దేశంలో మహిళలు ఎంతటి క్లిష్టతరమైన విజయాలైనా సాధించి తీరుతారని పలు సందర్భాల్లో రుజువు చేశారు. పట్టుదల.. ధైర్యం.. చేయాలన్న తపన ఉంటే.. ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ యువతి ప్రపంచం గర్వించదగ్గ విజయం సాధించింది. భారత యువ ట్రెక్కర్ గీతా సమోటా ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించి సంచలనం సృష్టించింది. శిఖరాగ్రంపై […]