రోజు రోజుకి కాలుష్యం ఎక్కువై పోతోంది. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం, వాహనాలు పెరిగిపోవడం, ఫ్యాక్టరీ లో ఉండే వ్యర్ధ పదార్ధాలని నదుల్లోకి వదలడం ఇలా అనేక కారణాల వల్ల కాలుష్యం బాగా పెరిగి పోతోంది. ఏది ఏమైనా వీటిని అదుపు చెయ్యాలి. లేదంటే ఎన్నో ప్రమాదాలు కలుగవచ్చు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. దీనితో పవిత్రమైన నదులు కూడా వ్యర్థ పదార్థాల తో నిండి పోతున్నాయి. కేవలం అక్కడే […]
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే […]