పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో బైకులను పక్కన పెట్టేశారా..? అయితే మీకో శుభవార్త. త్వరలోనే ఇంధన ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. ఆర్బీఐ సిపార్సుల మేరకు కేంద్రం కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించే దిశగా ఆలోచిస్తోందట.. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 100 రూపాయలకు పైగానే ఉంది. కరోనా కాలంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ మన దగ్గర మాత్రం అలా జరగలేదు. ఇక ఇంధన ధరల పెరుగదల వల్ల.. సామాన్యుల జీవితాలు మరింత భారంగా మారాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రతి దాని మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా కూరగాయలు మొదలు.. గ్యాస్ సిలిండర్ […]