మందుబాబులు పీకలదాకా తాగి వైన్ షాప్ ల దగ్గరే పడిపోతుంటారు. అలా తూలుతూ వాహనం నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్య కోసం ఇప్పటికే కొన్ని బార్లు క్యాబ్ సర్వీసులని అందిస్తున్నాయి. స్వయంగా ఇంటికి తీసుకెళ్లి దింపుతారు. అయితే ఇందుకు మందుబాబులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మందుబాబులను ఉచితంగా ఇంటికి తీసుకెళ్లేలా ఒక సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.