ఆరుగాలం పండించే పంటకు అడుగడుగునా సమస్యలను ఎదుర్కొంటున్నాడు రైతు. దుక్కు దున్ని, పంట పండించి, మనం అన్నం పెట్టే రైతు.. ప్రతి విషయంలోనూ మోసపోతున్నాడు. పంట పండించడంలో తమకు ఎదురౌతున్న సమస్యల గురించి అధికారులు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు.
లఖింపుర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి వాహన శ్రేణి వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఆ తర్వాతి ఘటనల్లో మరో నలుగురు మృతి చెందారు. ఆ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడు. ప్రస్తుతం సిట్ వెల్లడించిన విషయాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. లఖింపుర్ ఖేరీ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని వెల్లడించింది. ప్రణాళికా […]
మూడు కొత్త సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండానే రద్దు చేసింది. అలాగే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా ఆందోళన చేస్తూ మరణించిన రైతుల ఎలాంటి పరిహారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 750 మంది రైతులు మరణించారు. కాగా వారందరి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ రైతు సంఘాలు సహా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి […]