ఇప్పటి వరకు మనం ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు చూశాం గానీ ఇప్పుడు చెప్పుకోయే క్యాచ్ మాత్రం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుంది. ఈ అద్భుతమై క్యాచ్ యూరోపియన్ క్రికెట్ లీగ్ టీ10లో చోటుచేసుకుంది. అందరు సిక్స్ అనుకున్న ఆ బంతిని కాస్త ఇద్దరు ఫీల్డర్లు ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే.