న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారి పురుష, మహిళా క్రికెటర్లకు సమాన వేతనాలు చెల్లించేందుకు సిద్ధమైంది. న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే పురుష, మహిళా క్రికెటర్లకు ఇకపై ఒకే విధమైన కాంట్రాక్ట్ ఇవ్వనున్నారు. వారి జీతభత్యాల్లో ఎలాంటి తేడా ఇకపై ఉండబోదు. అలాగే దేశవాళీ క్రికెట్‌లోనూ ఇదే విధానం అమలు చేయనున్నారు. నిజంగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమనే చెప్పాలి. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు సారథి సోఫీ డెవిన్ […]