‘బజ్‌బాల్’ అనే పదం పుట్టకముందే.. అంతకుమించిన విధ్వంసంతో వన్డేల్లో రెండు సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
టీ20ల రాకతో టెస్టు క్రికెట్ మీద ఆసక్తి తగ్గిపోతుండగా.. మళ్ళీ ఈ ఫార్మాట్ ని కాపాడటానికి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది ఇంగ్లాండ్. దానినే "బజ్ బాల్" క్రికెట్ అంటారు. ఇందులో భాగంగా టెస్టు క్రికెట్ ని కూడా వన్డేల మాదిరి ఆడుతూ క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెక్కలం కోచ్ గా టెస్టు క్రికెట్ లో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్.. ఐర్లాండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టులో మరింత వేగంగా ఆడడం విశేషం.