బిర్యానీ అనగానే మొదటగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. మహానగరంలో తయారు చేసే బిర్యానీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఇక్కడి బిర్యానీపై మనస్సు పారేసుకుంటుంటారు. హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు బిర్యానీ తినకుండా ఉండలేరు. ఇప్పుడున్న బిర్యానీ ధరలు త్వరలోనే పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అంతేగాదు రుచి కూడా మారుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనకంతంటికీ కారణం అప్ఘాన్ లో నెలకొన్న సంక్షోభం కారణమంటున్నారు. బిర్యానీకి అఫ్గానిస్తాన్‌కు అవినాభావ సంబంధం ఉంది. హైదరాబాద్ బిర్యానీలో […]