శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
కృష్ణా నది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉంది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. ఎంతో కీర్తిగడించిన ఈ దుర్గామాత ఆలయం ఈ మధ్యకాలంలో వివిధ కారణలతో వార్తల్లో ఉంటుంది.
మోక్షం కోసం పూజలు చేయడం ఒక ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్ పూజారితో తన్నించుకున్నా కూడా మోక్షం వస్తుందని అక్కడి భక్తుల నమ్మకం. ఈ వింత ఆచారం మన తెలుగు రాష్ట్రంలోదే.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలను తీర్చే శ్రీ వారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక సెలవులు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు ఉన్న సమయంలో భక్తుల సంఖ్యగా భారీగా పెరుగుతుంది. తాజాగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు.
తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వర జాతర నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం క్షేత్రంలో కొలువైన శివలింగం ఇత్తడితో చేసిన పడగమధ్యలో సలేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉంటాడు. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు.
అమాయక భక్తులను దొంగ లీలలతో మోసం చేసిన ఫేక్ బాబాల గురించి వినుంటారు. కానీ ఈయన మాత్రం వాళ్ల కంటే కాస్త భిన్నం. తన కింద తానే మంట పెట్టుకుని మాడిపోతున్నాడీ బాబా. మిగిలిన వివరాలు..
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎప్పుడూ రద్దీ ఉంటూనే ఉంటుంది. ఇది వేసవి కావడంతో ఆ రద్దీ మరింత పెరుగుతుంది. అందుకే టీటీడీ అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల భక్తులకు టీటీడీ మరో శుభవార్త కూడా చెప్పింది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు, గుర్తింపు ఉంది. రోజుకి లక్షల్లో భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే రెండు రోజుల్లో ఎంత సంపాదిస్తారు. మహా అయితే నూటికి 2 రూపాయల వడ్డీకి తిప్పుకుని రూ. 12 వేలు సంపాదిస్తారు. కొంతమంది అయితే ఏకంగా రూ. 10 వడ్డీకి తిప్పుకుంటారు. అలా తిప్పుకున్నా గానీ రెండు రోజులకు 60 వేలు మాత్రమే సంపాదించగలరు. దీన్ని వ్యాపారం అనండి, దోపిడీ అనండి, ఇంకేమైనా అనండి. కానీ రెండు రోజుల్లో రూ. 30 లక్షలు సంపాదించడం సాధారణ మనుషుల వల్ల అవుతుందా? కానీ ఓ గ్యాంగ్ రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టి రెండు రోజుల్లో రూ. 30 లక్షలు సంపాదించారు. ఏం చేస్తే అంత డబ్బు వచ్చిందని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.