ప్రతి మనిషి జీవితంలో ఉండే సర్వసాధారమైన కోరిక సొంత ఇల్లు. తాను మరణించేలోపు తమ కంటూ ఓ సొంతంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి సొంత ఇంటి నిర్మాణం చేపడతారు, లేదంటే కొనుక్కుంటారు. అయితే అంత ముచ్చటపడి కట్టుకున్న, కొనుక్కున్న ఇల్లు.. గృహప్రవేశం జరిగిన కొన్ని రోజులకే కూలిపోతే.. హార్ట్ ఎటాక్ వచ్చినంత పనవుతుంది కదా. ఇదుగో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది నటి నవీనాకు. ఎంతో ఖర్చు […]
నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపట్టిన సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ భవనాలను మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కూల్చివేత పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.టెస్ట్ బ్లాస్టింగ్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 2022 ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల నడుమ ఈ బ్లాస్ట్‌ను నిర్వహించారు. జంట భవనాలకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, 13వ అంతస్థులోని […]
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన 40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు మాసాల్లో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. అలహాబాద్ హైకోర్టు 2017లో ఈ అక్రమాల్ని నిర్ధారించి కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బిల్డర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ వాదనల తర్వాత టవర్స్ కూల్చివేతపై […]
కరోనా వైరస్ దేశాన్ని ఎన్ని తిప్పలు పెడుతుందో తెలిసిందే. అయితే, ఈ వైరస్ నుంచి తమని రక్షించాలని కోరుకుంటూ ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా కరోనా మాత పేరుతో ఆలయాన్నే కట్టేశారు. శుక్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఆలయానికి స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనే శక్తి తమకు లేదని, ఈ మహమ్మారి నుంచి నీవే మమ్మల్ని రక్షించాలంటూ గ్రామస్తులు కరోనా మాతకు పూజలు చేస్తున్నారు. ఈ మందిరంలో […]