అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది. బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వేడిగా వాతావరణం ఉన్నప్పుడు గొంతులో చల్లని బీర్ పడితే వచ్చే మజాయే వేరు. ఆ విషయం గురించి బీర్ ప్రియులకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే అన్నింటికీ ఒక రోజు ఉన్నట్లే బీర్‌కు కూడా ఒక రోజు ఉంది. ఆ రోజును ఇంటర్నేషనల్ […]
బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ గీయాలి… ఎస్టిమేషన్ వెయ్యాలి…ఇటుకలు,సిమ్మెంట్ ఇనుము ఇలా ఎన్నో కొనాలి. ఇవన్నీ ఒకెత్తు. కట్టాలంటే ఎంతమంది కూలీలూ మేస్త్రీలు కావాలి. ఇల్లు కట్టి చూడు అన్నారు అందుకే. అందులో ఎన్నో సాధకబాధకాలు. అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కడుతున్నాం. అయితే ఇందులో వేగం పెరిగింది. అదీ రికార్డ్ స్థాయిలో. ఏకంగా 10 మనుషులు నివసించే 10 అంతస్థుల భవనాన్ని చైనా చాంగ్షాకు చెందిన బ్రాడ్ గ్రూప్ కంపెనీ తేలికగా కేవలం […]
చాక్లెట్ అంటే ప్రేమకు గుర్తు. అంతే కాదు – చాక్లెట్‌లోని స్వీట్‌నెస్‌ని జీవితంలోనూ షేర్ చేసుకోవడం అని కూడా అర్థం. చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. […]
ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి. తొలిదశ ఉద్యమంలో జరిగిన తప్పులను బేరీజు వేసుకుంటూ మలి దశ ఉద్యమ జెండా ఎత్తారు కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రజల స్వప్నం సాకారమైన దినం. 58 ఏళ్ల పాటు వివక్షకు గురై సొంత రాష్ట్రం సాధించుకొని నీళ్లు, నిధులు, నియమాకాల ట్యాగ్‌లైన్‌తో దేశంలో 29వ రాష్ట్రంగా […]
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే […]