గతేడాది అక్టోబర్ లో బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్‌లో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన విషయం తెలిసింది. తాజాగా ఈ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ నగరం, జూబ్లీహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌లో ఓ చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్కూల్లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఎల్‌కేజీ చిన్నారిపై పాడు పనికి పాల్పడ్డాడు. నెలల పాటు చిత్రహింసలకు గురి చేశాడు. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ లైంగిక దాడి విషయం బాలిక తల్లిదండ్రులు తెలిసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన వారు నిందితుడ్ని చితక బాది పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత […]