‘సింగర్ పార్వతి’ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. తన పాటతో ఊరి కలను నిజం చేసింది. ఎన్నో కష్టాలు పడి అక్కడిదాకా వెళ్లింది. కానీ, అవకాశం వచ్చాక తన కోసం ఏం కోరుకోలేదు. తన ఊరి వాళ్ల కల తీర్చాలని నిర్ణయించుకుంది. తను పడిన కష్టం తన ఊరిలో ఇంకెవరూ పడకూడదని భావించింది. మా ఊరికి బస్సు తెప్పించండి చాలు అని కోరింది. ఆ మాటకు కార్యక్రమంలోని జడ్జ్ లే కాదు.. […]
ఆమె సరిగమల పూదోటలో విరిసిన కుసుమం. ఆమె స్వరంలో సరాగాలు సయ్యాటలాడుతాయి. ఆమె పల్లవి ఎత్తుకుంటే కూలీల ఆరుగాలం కష్టం.. ఆవిరై పోతుంది. అయితే ప్రతిభ ఉన్నా పరాభవాలు తప్పలేదు. ఓ పక్క ఆమె గొంతును కొనియాడుతూనే రూపాన్ని వెక్కిరించేవారు. ‘రూపం కాకిలా.. గొంతు కోకిలలా’ అంటూ హేళన చేశారు. అయితేనేం.. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం అలుపెరగని పోరాటం చేసింది. ఆమె రూపాన్ని చూసి నవ్విన వారే ఇప్పుడు జేజేలు కొడుతున్నారు. ఏదైనా సాధించాలంటే అందం కాదు.. […]