మొన్నటి దాకా సెల్ఫీ పిచ్చి.. ఇప్పుడు రీల్స్, టిక్ టాక్ వీడియో, షార్ట్స్ ఇలాంటివి స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. లోకల్ గా సెలెబ్రిటీలుగా కావాలన్న ఆశతో కొంతమంది ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
కొంతమంది యువత ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ.. వీడియోలు తీస్తూ.. నానా హంగామా సృష్టిస్తుంటారు. ఇక మెట్రో రైళ్లలో వీరి రచ్చ తట్టుకోలేము. అయితే ఇప్పటి నుంచి మెట్రో రైళ్లలో, స్టేషన్లలో రీల్స్, వీడియోలు తీస్తే కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరించారు అధికారులు.