ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఓ అద్భతమైన క్యాచ్ చోటుచేసుకుంది. కామెరూన్ గ్రీన్ కొట్టిన భారీ షాట్ ను కళ్లు చెదిరే రితీలో ఒడిసి పట్టుకున్నాడు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే క్యాచ్ పట్టుకునే టైమ్ లో జడేజా కళ్లు మూసుకోవడం విశేషం.
ధోని ఒక్కసారి రివ్యూ తీసుకుంటే అందులో తిరుగుండదు అని మనందరికి తెలిసిన విషయమే. అదీకాక ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అంపైర్లకు సైతం కళ్లు బైర్లు కమ్ముతాయి. అందుకే అభిమానులు ముద్దుగా DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూంటారు. తాజాగా మరోసారి తన రివ్యూ సత్తా ఏంటో చూపించాడు మిస్టర్ కూల్.