దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కార్లు, బైకులు ఏవన్న విషయపై ఓ ఆటో ఈ-కామర్స్ సంస్థ సర్వే చేపట్టింది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని బేస్ చేసుకొని ఈ సర్వే చేపట్టగా, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది ప్రజలు మీడియం రేంజ్ కార్లను, బైకులనే ఇష్టపడుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ప్రజల మనసు చూరగొన్న ఆ కార్, బైక్ ఏదో తెలియాలంటే కింద చదివేయండి..
హ్యూండాయ్ మోటార్ ఇండియా వాహనదారులకు తీపి కబురును అందించింది. సరికొత్త టెక్నాలజీతో క్రెటా అప్ డేటెడ్ వర్షన్-2022 ను హ్యూండాయ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వాహనంలో సరికొత్త మార్పులు, చేర్పులు చేశామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. క్రెటా అప్ డేటెడ్ వర్షన్ రూ.12.83 ఉండగా 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ వెర్షన్లలో లభించే నైట్ ఎడిషన్ పెట్రోల్ ట్రిమ్ ధర మాత్రం రూ. 13.51 లక్షల నుంచి 17.22 వరకు ఉంటుందని కంపెనీ తాజాగా ప్రకటించింది. […]