వినాయక చవితి నేపథ్యంలో ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి చెందిన కాంత యాదవ్ ఆవుపేడతో పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు తయారు చేశారు. హిందూ సంస్కృతితో ఆవుపేడను పవిత్రంగా భావిస్తుంటారు. అందుకే ఎండిన ఆవుపేడతో కలప దుమ్ము, మైదా పొడి కలిపి మిశ్రమాన్ని వినాయకుడి అచ్చులో పోసి విగ్రహాన్ని తయారు చేశామని 15 నిమిషాల్లోనే తయారు చేసిన ఈ విగ్రహాలు ఆరబెట్టడానికి నాలుగైదు రోజులు పడుతోంది. […]