రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో నాలుగు వారాల్లో కట్టడి చేసే మందు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు నిపుణులు. కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. […]