తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ సత్య టాలీవుడ్ ఇంటర్వ్యూల మీద స్పూఫ్ వీడియోతో మన ముందుకు వచ్చారు. రంగబలి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా జర్నలిస్టులను ఇమిటేట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కమెడియన్లలో సత్య ఒకరు. సత్య కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించారు. ఆయనకు అవకాశాలు ఎక్కువగా వచ్చినా కూడా గుర్తింపు మాత్రం అంతగా రాలేదు. తాజాగా ‘రంగబలి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్‌లో స్పెర్మ్‌ను రోడ్డు మీద తేనె అమ్మినట్టు అమ్మేద్దాం అంటూ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ దృష్టిలో పెట్టుకొని తదుపరి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిన చరణ్.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో ‘RC15’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నటుడిగా స్టార్ గా ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్నవాళ్లలో చరణ్ ఒకరు. చాలా సింపుల్‌గా తన తోటి నటీనటులతో సరదాగా కలిసిపోతాడు. తాజాగా చరణ్ పర్సనల్ చార్టర్డ్ […]