చలికాలం వచ్చిందట చలి పులి అవతారం ఎత్తుతుంది. పులిని చూస్తే ఎంత భయపడతారో అంతకంటే ఎక్కువగా చలి అంటే భయపడిపోతారు జనం. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. పని చేయాలంటేనే వణుకు వచ్చేస్తుంది. ఈ గడ్డకట్టే చలిలో రోడ్డు మీద నడవాలంటేనే భయపడే పరిస్థితి. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పొగమంచు కమ్మేస్తుంది. గడ్డ కట్టేంత చలితో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయాన్నే లేచి స్కూళ్ళకి, ఆఫీసులకి రావడం అంటే వణుకుతున్నారు. దేశంలోనే కాదు […]
రెండు, మూడుల రోజుల నుంచి చలి విపరీతంగా పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి చుక్కలు చూపిస్తోంది. దడ పుట్టిస్తున్న చలి కారణంగా బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దాదాపు 25 మంది చలి కారణంగా మృత్యువాత పడ్డారు. బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లతో ప్రాణాలు విడిచారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. […]