శుభకార్యమైనా, అశుభకార్యమైన మద్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు. బర్తుడే వేడుకలు, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో మద్యం తాగి తెగ ఎంజాయ్ చేస్తుటారు. మరి కొంత మంది ఫుల్లుగా మద్యం సేవించి నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తారో కూడా తెలియదు. కొన్ని కొన్ని సార్లు ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రమాదాలు భారిన పడుతుంటారు.