తోడికోడళ్లు అంటే కలిసి ఉండకూడదు, ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండాలి, కుదిరితే కలబడి కొట్టేసుకోవాలి అని చెప్పి చాలా మంది కొన్ని వందల, వేల లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇళ్లలో ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథల్లో ఎక్కువగా కనబడతాయి అని వాళ్ళూ, వీళ్లూ చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. తోడికోడళ్లు 5 నిమిషాలు మాట్లాడుకుంటే.. ఆరో నిమిషంలో పోట్లాడుకుంటారనే ప్రచారం ఉంది. గట్టిగా 10 నిమిషాలు కలిసి ఉండలేని తోడికోడళ్లు.. ఏకంగా 11 ఏళ్ళు కలిసి ఉన్నారంటే గొప్ప విషయమే. కలిసి ఉండడమే కాదు, కలిసి వ్యాపారం కూడా చేస్తున్నారు. బిజినెస్ అంటే మళ్ళీ అల్లాటప్పా యాపారం అనుకునేరు. ఏడాదికి రూ. 600 కోట్లు టర్నోవర్ చేసే బిజినెస్ చేస్తున్నారు.
ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్‌కు డెబ్బీ నీల్-స్ట్రిక్‌ల్యాండ్‌తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు […]