సింగర్ చిన్మయి… డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గానే కాకుండా సోషల్ మీడియాలో సమకాలీన అంశాలపై స్పిందిస్తూ తన భావనను వ్యక్తపరుస్తుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వచ్చే ఎలాంటి అంశాలపై అయిన ఈ సింగర్ స్పందిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే చిన్మయి- రాహుల్ దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. […]