మనిషికి ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది అనుకోని ప్రమాదాల వల్ల దుర్మరణం చెందుతున్నారు.
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ లోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా దావానంలా మారిపోయింది. అక్కడ ఉన్న కొన్ని నాలుగు రియాక్టర్లు భారీ శబ్ధంతో పేలాయి. ప్రమాదంలో హరిప్రసాద్, అర్జున్, మనీష్ బస్కీ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ అనే కార్మికుడి ఆచూకీ తెలియడం లేదు. పరిశ్రమలోని రసాయన డ్రమ్ములు భారీ శబ్దాలతో పేలుతున్నాయి. ప్రమాదం జరిగిన స్థలంలో […]