సినీ హీరోలపై ప్రజలకు ఉండే అభిమానం ఎంతో గొప్పది.. దాన్ని ఎవరూ వెలకట్టలేరు. వెండితెరపై తమ అభిమాన హీరో కనిపించగానే కాగితాలు, పూలు చల్లుతుంటారు. థియేటర్ల బయట ఆ చిత్రం ‘తొలి షో’కు ముందుగానే భారీ కటౌట్లు పెడుతుంటారు. వాటికి పూలదండలు వేసి, పాలాభిషేకం కూడా చేసేస్తుంటారు. మరి కొందరు అభిమానులైతే ఏకంగా గుడి కట్టించి పూజిస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తమ హీరోలకు మద్దతుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. కొన్ని సందర్భంగా వందల కిలోమీటర్లు […]