స్పోర్ట్స్ డెస్క్- లార్డ్స్ మైదానంలో భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు విపరీత ధోరణిితో ప్రవర్తించారు. మూడో రోజు తొలి సెషన్‌లో ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కొందరు రాహుల్‌పై షాంపేన్ కార్క్స్ విసిరారు. కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సందర్బంలో చాలా షాంపేన్ కార్కులు అతడి దగ్గర్లో వచ్చి పడ్డాయి. దీన్ని గమనించిన కామెంటేటర్లు సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. […]