పసికందు నుండి కాటికి కాళ్లు చాపే ముసలి వాళ్ల వరకు ఎవ్వరిని వదలడం లేదు కామాంధులు. ముఖ్యంగా అభం, శుభం తెలియని మైనర్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారు. ఇంట్లో చెప్పలేక, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు గర్భం దాలుస్తున్నారు.
దేశంలో ఎక్కడా అన్యాయం జరిగినా ముందు మనకు గుర్తుకు వచ్చేది పోలీసులే. 365 రోజులు విధి నిర్వహణలో మునిగి తేలుతారు. ఇప్పటికీ గుండెలపై చేయి వేసి హాయిగా రాత్రి పూట నిద్రపోతున్నామంటే కారణం వాళ్లే. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తారు. ఎటువంటి పతకాలు ఆశించరు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. అటువంటి పోలీస్ శాఖ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీ పోలీస్ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం, సమర్థత, నిజాయితీతో […]
దేశంలో ఓ వైపు పేదరికం, నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. మరోవైపు దేశంలోని సంపన్నులు మరింత ధనవంతులుగా ఎదుగుతూనే ఉన్నారు. సంపాదించిన సొమ్ము స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంపన్నులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగింది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విడ్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు తెలిపింది. 2019లో 6 వేల 625 కోట్లు ఉన్న భారతీయుల సంపద ఒక్కసారిగా పెరిగినట్లు స్విస్ బ్యాంకు చెప్పింది. […]
గత కొన్ని నెలలుగా పలు అంశాలపై కేంద్రం, ట్విటర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించాలంటూ కేంద్రం జూన్ నెల మొదటివారంలో ట్విటర్‌కు తుది నోటీసు జారీ చేసింది. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖుల వ్యక్తిగత ఖాతాల నుంచి వెరిఫికేషన్ మార్క్ ‘బ్లూ టిక్’ తొలగించిన ట్విటర్ విమర్శలు ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు మరో నోటీసు […]
వారణాసి ప్రజలకు కొవిడ్‌కు సంబంధించిన ప్రశ్నలన్నింటికీ ఒకేచోట సమాధానం లభించేలా ‘కాశీ కొవిడ్ రెస్పాన్స్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని వివిధ జిల్లాల్లో అధికారులు అనుసరిస్తున్న వినూత్న విధానాలను క్రోడీకరించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వాటిని రాష్ట్రాలకు పంపించింది. ప్రధాని మోదీ ఈనెల 18, 20 తేదీల్లో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌లతో జరిపిన చర్చల సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని వివరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ […]