చాక్లెట్ అంటే ప్రేమకు గుర్తు. అంతే కాదు – చాక్లెట్‌లోని స్వీట్‌నెస్‌ని జీవితంలోనూ షేర్ చేసుకోవడం అని కూడా అర్థం. చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. […]