గుడుంబా తయారీ, గంజాయి సాగుపై నిషేధం విధించినప్పటికి స్మగ్లర్లు వాటిని రవాణా చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు అబ్కారీ పోలీసులు కూలీల వేషం ధరించి స్మగ్లర్ల ఆటకట్టించారు.
మత్తు పదార్థాలు, వ్యసనాలకు బానిసలై.. జీవితాలు తల కిందులవుతున్నా యువత పెడదారి పడుతూనే ఉన్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మత్తు పదార్థాల విక్రయం జోరుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విక్రయాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యాపారం ముసుగులో మత్తు ఇంజెక్షన్లను అమ్ముతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో వెలుగు చూసింది. మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని బుధవారం దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. తుక్కు వ్యాపారం మాటన […]
నగరం నడిబొడ్డున సీక్రెట్ గా సాగుతున్న గంజాయి గుట్టును రట్టు హైదరాబాద్ పోలీసులు. విద్యార్థులు, స్కూల్, కాలేజీలనే టార్గెట్ గా చేసుకున్న కేటుగాళ్లు ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా పాన్ షాపులలో కూడా గంజాయిని విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీసులు నిందితుడి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ చెందిన జాఫర్ అనే వ్యక్తి హైదరాబాద్ ను అడ్డాగా చేసుసుకుని సీక్రెట్ గా గంజాయిని […]
మధ్యప్రదేశ్- మంచి పని చేయాలంటే ఒకటి రెండు మార్గాలే ఉంటాయి. కానీ చెడు పని చేయాలంటే మాత్రం ఎన్నో మార్గాలుంటాయని నిరూపించారు స్మగ్లర్లు. మామూలుగా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు పట్టబడిపోతున్నామని వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఈ సారి ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వార రవాణా మొదలుపెట్టారు గంజాయి స్మగ్లర్లు. గంజాయి సరఫరాపై పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ […]
హైదరాబాద్- తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు పిలుపునిచ్చారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయిపై బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా ఉండేందుకు వీల్లేదని ఈ […]
పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత తెలుసుకదా.. ఇక్కడ ఈ పెద్దాయన చేసిన పని అంతకన్నా ఘోరంగా ఉంది. బాధ్యతాయుత పదవిలో ఉంటూ.. ప్రజాప్రతినిధిగా, గ్రామ ప్రథమ పౌరుడిగా చేయాల్సిన పనులు కాకుండా పాడు పనులు చేస్తున్నాడు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి ప్రజల ప్రాణాలు తీసే గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్‌గాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను […]