తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదన్న హైకోర్టు.. లాక్‌డౌన్ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం లాక్‌డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామన్నారు. లాక్‌డౌన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌పై సాయంత్రానికి […]