దేశంలో ఇటీవల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మద్య మాటల యుద్దం నడుస్తుంది. దేశాభివృద్ది కోసం ఎంతో పాటు పడుతున్నామని.. దేశాన్ని ప్రగతిపధంలో ముందుకు నడిపిస్తున్నామని బీజేపీ అంటుంటే.. బీజేపీ పాలనలో దేశం పూర్తిగా బ్రస్టుపట్టిపోయిందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా రానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ రాజకీయ రంగును పులుముకుంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. కాగా.. ఇప్పుడు దీన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరుగా చూస్తామంటూ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు పేర్కొనడం చర్చకు దారితీస్తుంది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్1లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా […]