సినీ ఇండస్ట్రీలో ఆటుపోట్లు అనేవి సర్వసాధారణం. కానీ నలభైయేళ్ళ సినీ ప్రస్థానం కలిగిన సీనియర్ నటుడికి పబ్లిక్ లో అవమానం జరగడం అనేది బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి. అనుకోకుండా నటన రంగంలోకి వచ్చి.. ఆపై 400కి పైగా సినిమాలలో నటించి.. స్టార్స్ నుండి యంగ్ హీరోల వరకూ అందరు హీరోలతో, దర్శకులతో సినిమాలు చేసి.. మంచి గుర్తింపు దక్కించుకున్న తెలుగు నటుడు బెనర్జీ.. తాజాగా ‘మా’ ఎన్నికల వివాదంపై స్పందించారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకూ ఆయన […]
‘మా’ ఎన్నికలతో తెలుగు ఇండస్ట్రీలో మొదలైన వివాదాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మేమంతా ఒకే కుటుంబం అని పైకి చెబుతున్నా కూడా లోలోపల జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ మొదలు గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. విష్ణు ప్యానల్ వారు వారికి నచ్చిన వారిని ఎంచుకుని మా అసోసియేషన్‌ను నడిపించాలని సూచించారు. ఆ ప్రెస్‌మీట్‌లో సీనియర్ నటుడు బెనర్జీ తనకు అవమానం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. […]