తెలంగాణలోని వికారాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీసీఐ అండర్-19 మహిళా జట్టుకు ఎంపికైన వర్ధమాన క్రీడాకారిణి నందిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక యువకుల నుంచి ఎదురైన వేధింపులు భరించలేకే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చక్కని భవిష్యత్ ఉన్న యువ క్రికెటర్ అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యాలాల మండలం సంగయ్యపల్లి గ్రామానికి చెందిన నందిని, క్రికెట్లో రాణించాలనే లక్ష్యంతో వికారాబాద్ పట్టణానికి వచ్చింది. మధు కాలనీ […]