కాసేపట్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. అందరు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పక్క ఊరి నుంచి తమ బంధువులు వస్తున్నారనే సమాచారం పెళ్లి ఇంటి వారికి తెలిసింది. వారి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే పెళ్లి వారికి విగతజీవులుగా బంధువులు కనిపించడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది.