కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ ఎస్ యూ ఐ) తెలంగాణ అధ్యక్షుడు, కాంగ్రెస్ యువనాయకుడు బల్మూరి వెంకట్‌ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు గురువారం అర్దరాత్రి అదపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై గాడిద దొంగతనంతో పాటు దాన్ని శారీరకంగా హింసించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి హుజురాబాద్‌లో వెంకట్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బల్మూరి వెంకట్ అరెస్ట్ ఘటనపై కరీంనగర్ అడిషనల్ […]