ఇంటర్నేషనల్ డెస్క్- మరో గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోంది. ఐతే అది భూమికి అతి సమీపంలోంచి వెళ్తుందే కాని, మనకు ఎటువంటి హానీ జరగదని నాసా చెబుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద కట్టడం బుర్జ్ ఖలీఫా కంటే పెద్దదిగా ఉన్న ఒక గ్రహాశకలం భూమి వైపు దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఈ గ్రహశకలానికి 1994 పీసీ1గా నామకరణం చేశారు. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనుంది. […]